కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం-డిసిసి అధ్యక్షుడు

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం-డిసిసి అధ్యక్షుడు

-అధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి

క్యాతన్, ఆంధ్రప్రభ : క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చందనగిరి లావణ్య శ్రీనివాస్ ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యనగర్ లో ఏర్పాటు చేసిన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిసి అధ్యక్షుడు పిన్నింటి రఘునాథరెడ్డి పాల్గొని సభలో ప్రసంగించారు.కాంగ్రేస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.మహిళకు ఉచిత బస్సు,ఇంటింటికి 200 ఉచిత విద్యుత్ అందిస్తుందని,చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రజలకు వివరించారు.అనంతరం గడపగడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చందనగిరి లావణ్య శ్రీనివాస్ అధిక మెజారిటీ ఓట్లతో గెలిపించాలని కోరారు.

Leave a Reply