దీవించండి… సేవకుడిగా పని చేస్తా..

దీవించండి… సేవకుడిగా పని చేస్తా..

-అభివృద్ధి లక్ష్యంగా ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దుతాను..
-ఎల్లవేళలా మీ కష్టాల్లో మీ వెన్నంటే ఉంటాను..
-ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య అండతో నిధులు తేస్తాను..
-ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పక్కా ఇండ్లు ఇప్పిస్తాను..
-సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం..
-ఎస్సీ నిరటి కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం..
-విద్యుత్ స్తంభాలు, లైన్ల సమస్యల పరిష్కారం..
-అర్హులందరికీ పింఛన్లు, సంక్షేమ పథకాలు..
-అన్ని కులాలకు సమాన అభివృద్ధే లక్ష్యం..
-చేయి గుర్తు సీరియల్ నెంబర్ 2కు ఓటు వేసి గెలిపించండి..

  • 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గట్టు సంగీత రమేష్

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో గట్టు రమేష్ పేరు వినిపిస్తే ప్రజలకు నమ్మకం గుర్తుకు వస్తోంది. 30 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా.. ప్రజా సమస్యల పై పోరాటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ప్రతి ఉద్య మ కార్యక్రమంలో ఆయనకు చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ఆకాంక్షలను ప్రజల్లో బలంగా వినిపించినందుకు ఆయన పై కేసులు నమోదు కాగా వారం రోజుల పాటు జైలు జీవితం గడిపిన ఉద్యమ నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉద్యమ కాలంలో ఎదురైన కష్టాలు, త్యాగాలు ఆయనను మరింత ప్రజల వైపు నడిపించాయి. ఉద్యమ స్ఫూర్తిని ఇప్పటికీ గుండెల్లో దాచుకుని, ప్రజల కోసం అహర్నిశలు పని చేస్తున్న నాయకుడిగా ఆయనను ప్రజలు ఆదరిస్తున్నారు. తెలంగాణ సాధన తర్వాత కూడా అదే ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయ జీవితం కొనసాగిస్తూ ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్నారు.

-అన్న అని పిలిస్తే అప్యాయంగా పలికే నేతగా:
ప్రతి సేవా కార్యక్రమంలో ముందుండే రమేష్ అన్న అని పిలిస్తే అప్యాయంగా పిలిచే నాయకుడు అని ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటం, సమస్య విన్న వెంటనే స్పందించడం ఆయనకు ప్రత్యేకత ఉంది.

-12వ వార్డులో ముమ్మర ప్రచారం:
స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో కాంగ్రెస్ అభ్య ర్థిగా గట్టు సంగీత రమేష్ పోటీ చేస్తున్నారు. అభ్యర్థి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నారు. ఈ సందర్బం గా ఓటర్లను 12వార్డ్ సీరియల్ నెంబర్ 2 చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థి విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా అభ్యర్థి ప్రజలకు కీలక హామీలు ఇస్తూ వార్డు అభివృద్ధికి స్పష్టమైన దిశను చూపిస్తున్నారు. వార్డులో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తాను. అలాగే ఎమ్మెల్యే సహకారంతో నిరుపేదలకు 30 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత నాదేనని స్పష్టం చేశారు. ఎస్సీ నిరటి కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, విద్యుత్ స్తంభాలు, లైన్ల సమస్యలను పూర్తిగా సరి చేస్తామని హామీ ఇచ్చారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు వచ్చేలా కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటా మని తెలిపారు. అన్ని కులాలకు సమాన అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు. గౌడ్ సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తానని, అలాగే ఎల్లమ్మ గుడి నిర్మాణం, గుడికి వెళ్లే రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చా రు. అభ్యర్థి మాటలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుండ టంతో, వార్డులో గెలుపు ఖాయం అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటూ మద్దతు తెలుపు తున్నారు.

Leave a Reply