కౌన్సిలర్ గా గెలిపించండి.. అభివృద్ధి చేస్తా..

కౌన్సిలర్ గా గెలిపించండి.. అభివృద్ధి చేస్తా..

  • 10వ వార్డు బీజేపీ అభ్యర్థి రాఘవేందర్ గౌడ్

కల్వకుర్తి, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను ఓటర్లు ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని 10వ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నీరుకంటి రాఘవేందర్ గౌడ్ ఓటర్లను కోరారు. ఎన్నికల్లో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి వార్డులో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూన్నారు. ప్రతిరోజు గడప గడపకు తిరుగుతూ ఓటర్లను కలుస్తూ మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుపై వేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

నా బలం బలగం వార్డు ప్రజలేనని పేర్కొంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందంటూ ప్రచారంలో వాటిని ఆస్త్రాలుగా మలుచుకుంటూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తనదైన శైలిలో రాఘవేందర్ గౌడ్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. ఈనెల 11న జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని రాఘవేందర్ గౌడ్ ఓటర్లను కోరారు.

Leave a Reply