వామ్మో పులి…

వామ్మో పులి…

రాయవరంలో భయం భయం

ఊళ్లోనే   పులి మకాం

ఆపరేషన్​ కాప్చర్​ షురూ

ఇళ్లలోంచి బయటకు రావొద్దని అధికారులు దండోరా

( ఆంధ్రప్రభ,  రాజమహేంద్రవరం)  

తూర్పుగోదావరి జిల్లా, రాయవరం మండలం, కూర్మాపురం గ్రామంలో భయోత్పాతం సృష్టించింది. ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని రాయవరం ప్రజలు క్షణం క్షణం భయంతో అల్లాడుతున్నారు. మరో వైపు ఆ పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు మొహరిల్లారు. అసలేం జరిగిందంటే…  ఒక ఇంటి వెనుక భాగంలో (బ్యాక్‌యార్డ్) పులి  ఉన్నట్లు జరం గుర్తించారు.  అది షాట్ చేసేలోపు  చుట్టూ ఉన్న ప్రజల అలజడికి భయపడి పక్కన ఉన్న పొలాలలోకి ఉరికింది..

సుమారు పావు కిలోమీటర్ దూరంలోని గొడ్ల పాక లోకి దూరింది. ప్రజలు అక్కడి 1 కిలోమీటర్ దూరం ఖాళీ చేసి తలుపులు మూసి వేసుకొని బయటకి రావద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.  పులిని సురక్షితంగా పట్టుకునే క్యాప్చర్ ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌కు పోలీసు శాఖ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోంది. పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎవ్వరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారుల మనవి చేశారు.

ముఖ్యంగా రాత్రి సమయంలో బయటకు వెళ్లకుండా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  ఇప్పటి వరకు పులి కేవలం జంతువులపై మాత్రమే దాడి చేసిందని, మనుషులపై ఎటువంటి దాడి జరగలేదని అధికారులు తెలిపారు.

పులి సంచరించే ప్రాంతాల్లో ఎటువంటి అలజడి, శబ్దాలు సృష్టించవద్దని సూచించారు. పులి స్వభావం చాలా సెన్సిటివ్‌గా ఉండటంతో దాని కదలికలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.  పులి కదలికలపై అటవీ శాఖ నిరంతర నిఘా కొనసాగిస్తోంది. అవసరమైన సమాచారం అధికారికంగా మాత్రమే తెలియజేస్తామని, వదంతులను నమ్మవద్దని   జిల్లా అటవీ అధికారి బి. ప్రభాకర రావు స్పష్టం చేశారు.