ఓటర్ల అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేస్తా..

ఓటర్ల అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేస్తా..

  • 15వ వార్డు బిజెపి అభ్యర్థి కుక్కల విజయ్ కుమార్

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని 15 వార్డు ఓటర్లు ఆదరిస్తే అభివృద్ధి చేస్తానని పరకాల పురపాలక సంఘం 15వ వార్డులో బిజెపి అభ్యర్థి కుక్కల విజయ్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచార లో భాగంగా ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రచారం ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం రోజు పరకాల పురపాలక సంఘం 15వ వార్డు బిజెపి పార్టీ అభ్యర్థి కుక్కల విజయ్ కుమార్ వార్డులోని ఓటర్ల ద్వారా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి విజయ్ కుమార్ మాట్లాడుతూ 15 వార్డులో డ్రైనేజీ, సిసి రోడ్ల నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వార్డులోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. అభ్యర్థి విజయ్ కుమార్ వెంట బీజేపీ నాయకులు కుక్కల శ్రీధర్, శంకర్, నాయకులు, నాయకురాళ్లు ఉన్నారు.

Leave a Reply