under 19 |వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం ఫైట్‌

under 19 |వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం ఫైట్‌

  • నేడు అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌
  • ఇంగ్లండ్‌తో భారత్‌ ‘ఢీ’.
  • జోరుమీదున్న యువ‌భార‌త్‌
  • మధ్యాహ్నం 1 గంట నుంచి మ్యాచ్ ప్రారంభం
  • స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్‌

జోరుమీదున్న భార‌త్‌..
ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2026లో ఆయుష్ మత్రే నాయకత్వంలోని భారత యువ జట్టు ఈ టోర్నీలో అజేయంగా నిలిచింది. సెమీఫైనల్ పోరులో ఆఫ్ఘనిస్తాన్‌పై 311 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఓపెనర్ ఆరోన్ జార్జ్ అద్భుత శతకంతో (115) జట్టును ఆదుకోగా, వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ (68) టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. కెప్టెన్ ఆయుష్ మత్రే కూడా కీలకమైన అర్ధశతకంతో (62) జట్టును విజయం దిశగా నడిపించాడు. ఇది భారత్‌కు వరుసగా ఆరో ఫైనల్ కావడం విశేషం.

మ‌నోళ్లు ఐదు సార్లు క‌ప్ కొట్టారు..
అండర్‌–19 ప్రపంచకప్‌ 1988లో మొదలైంది. ఇప్పటివరకు 15 మెగా ఈవెంట్లు జరిగితే ఏ కుర్ర జట్టుకు సాధ్యం కానీ ఐదు టైటిళ్లను భారత జట్టే గెలిచింది. ఓవరాల్‌గా 16 (ప్రస్తుత కప్‌) ప్రపంచకప్‌ల్లో 10 సార్లు ఫైనల్‌ చేరిన ఘనచరిత్ర కూడా మనదే! వరుసగా యువ భారత్‌కిది ఆరో ఫైనల్‌. గత 2024 ఈవెంట్‌లోనూ ఫైనల్‌ చేరినా… ఆ్రస్టేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

సవాల్ విసురుతున్న ఇంగ్లాండ్
మరోవైపు థామస్ రూ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు కూడా అజేయంగానే ఫైనల్‌కు చేరింది. తొలి సెమీఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ వేటకు సిద్ధమైంది. బెన్ మేయెస్ 399 పరుగులతో అత్యద్భుత ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు పెద్ద బలం. ఇంగ్లండ్‌ 1998లో జరిగిన రెండో ప్రపంచకప్‌లో తొలిసారి టైటిల్‌ గెలిచింది. నాలుగేళ్ల క్రితం 2022 ఫైనల్‌లో భారత్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ జట్టు యోచిస్తోంది.

Leave a Reply