TTD EO | తిరుమలకు చేరుకున్న ముద్దాడ రవిచంద్ర

TTD EO | తిరుమలకు చేరుకున్న ముద్దాడ రవిచంద్ర
TTD EO | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన ఈఓ ముద్దాడ రవిచంద్ర తిరుమలకు చేరుకున్నారు. గాయత్రి నిలయం అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. రేపు శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు చేపట్టనున్నారు.
తెలుగు రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్‌కి తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యతలను అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం టీటీడీ నూతన ఈవోగా నియమించింది. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ ను బదిలీ చేశారు.
