ration shop l నర్సింగాపురం గ్రామస్తులు రేషన్ బియ్యం కోసం ధర్నా

ration shop l నర్సింగాపురం గ్రామస్తులు రేషన్ బియ్యం కోసం ధర్నా

నర్సంపేట,ఆంధ్రప్రభ; వరంగల్ జిల్లా నర్సింగాపురం గ్రామస్తులు రేషన్ బియ్యం కోసం ధర్నా చేపట్టారు. రేషన్ బియ్యం పొందేందుకు గ్రామ రేషన్ డిపో నుంచి 2- 3 కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోందని అవేదన వ్యక్తం చేశారు. ఈ దూరం వల్ల ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, బరువైన బియ్యం సంచులను తీసుకెళ్లడానికి ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది, ఇది అదనపు ఖర్చులను కలిగిస్తోందనీ గ్రామస్తులు వాపోయారు.

గ్రామస్తులు స్థానిక మండల అధికారి, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. వెంటనే నర్సింగాపురంలో రేషన్ డిపో ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డామాండ్ చేశారు. పంచాయతీరాజ్ శాఖ, సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ ఈ సమస్యలపై త్వరగా స్పందించాలన్నారు. గ్రామంలోనే రేషన్ డిపో ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల ఇబ్బందులు తగ్గించవచ్చునని ఇటుకాలపల్లి వంటి గ్రామాల్లో ఇలాంటి సమస్యలు పదే పదే సంభవిస్తున్నాయనీ, సమస్యపై వెంటనే ప్రభుత్వ అధికారులు పరిశీలించాలనీ నరసింగాపురం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply