మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ ను ఓడించాలి

మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ ను ఓడించాలి

  • మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ ; నాగర్ కర్నూల్ము న్సిపల్ ఎన్నికల్లో భాగంగా గురువారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 18వ వార్డులో పస్పుల గాయత్రి లక్ష్మయ్య,19 వ వార్డులో పెంటామరాజు వాణి పార్థసారథి భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల పరిధిలోని కాలనీలలో ప్రజలను కలుస్తూ రెండేళ్ళుగా వారు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకుంటూ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించలని కోరారు. పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే ప్రభుత్వంతో కోట్లాడి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు.

కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే పనులు కాకుండా మాయ మాటలు చెప్పి పూట గడుపుతారు అని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల ద్వారా ప్రజలకు బాకీ ఉన్న పథకాలను కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో ప్రజలకు వివరించారు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి హామీలను అమలు చెయ్యకుండా మోసం చేసి మళ్లీ మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి మోసం చేయడానికి వస్తున్నారు అని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ వారిని వారు ఇచ్చిన హామీల పై ఎక్కడిక్కడ నిలదీయలని ప్రజలకు పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో వార్డు అభ్యర్థులు వారి వెంట పలువులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply