అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించండి

10వ వార్డు ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి కర్రెం చెన్నమ్మ నీలప్ప
మక్తల్ , ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ) మక్తల్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని 10వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్రెం చెన్నమ్మ నీలప్ప ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తన మద్దతు దారులతో కలిసి 10వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి కర్రెమ్ చెన్నమ్మ జి.నీలప్ప జోరుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృధి కార్యక్రమాలు గురించి ఇంటింటి ప్రచారంలో ప్రజలకు వివరించారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కోసం మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో 10వ వార్డులో రోడ్లు డ్రైనేజీలు, వీధి లైట్స్ ఏర్పాటు చేయిస్తామన్నారు.అంతే కాకుండా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తామన్నారు. కాలనీ సమస్యలను పరిష్కరించినందుకు ముందు ఉంటాననీ అన్నారు.11న జరగనున్న ఎన్నికల్లో అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి గెలిపించాల్సిందిగా కౌన్సిలర్ అభ్యర్థి కర్రెం చెన్నమ్మ నీలప్ప విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
