5th ward | న‌న్ను ఆద‌రించి ఓటు వేయండి..

5th ward | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : అవినీతి రహిత పాలన కోసం బీజేపీ బలపరిచిన అభ్యర్తులను గెలిపించాలని బీజేపీ ఐదో వార్డు అభ్యర్థి కొండ గోదావరి, ప్రకాష్ గౌడ్ అన్నారు. ఈ రోజు పట్టణంలోని ఐదో వార్డులో మహిళలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఆడపడుచుగా మీ సేవ చేసేందుకు వస్తున్నా తనను ఆదరించాలని కోరారు. బీజేపీ గుర్తు పువ్వు ( కమలం)కు ఓటు వేసి విజయం అందించాలని కోరారు. మహిళలకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవ చేస్తానని పేర్కొన్నారు.

ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగా తన వద్దకు రావొచ్చని అన్నారు. ఎలాంటి అహంకారం, గంబీరం లాంటి వాటికి తావు లేకుండా ప్రజా సేవ కొరకే తాను రాజకీయం లో ఉన్నట్టు తెలిపారు. రాజకీయాలు తనకు కొత్త కాదని, తన భర్త రాజకీయ నాయకుడిగా భీంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన సంగతి గుర్తు చేశారు. ఎంపీపీ గా తనకున్న అనుభవంతో ఐదో వార్డు ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పట్టణాన్ని దోచుకు తినే నాయకులకు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.