Central Govt | కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి అన్యాయం.

Central Govt | కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి అన్యాయం.

Central Govt | కరీమాబాద్, ఆంధ్రప్రభ : ఏఐఎస్ఎఫ్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం శివకుమార్ అధ్యక్షతన సోమవారం శివనగర్ తమ్మర భవన్ లోజరిగింది. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ల్యాదాళ్ళ శరత్ మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ యందు ప్రవేశపెట్టిన2026-2027 వార్షిక బడ్జెట్ లో విద్యా రంగానికి అన్యాయం చేస్తున్నది. 12 ఏళ్ల మోడీపాలనలో విద్యా రంగానికి కేటాయింపులు తగినమొత్తంలో జరగటంలేదు.

ఈ సంవత్సరం 53.5 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్లో విద్యకు కేటాయించిన నిధులు కేవలం 1,39,289 కోట్లు. ఇది మొత్తం బడ్జెట్లో 2.6 శాతం మాత్రమే! ఈ నిధులు పెరిగినట్లు కనిపించినప్పటికీ మొత్తం బడ్జెట్ లో శాతంలో పెరుగుదల లేదు. కేంద్ర బడ్జెట్ లో కనీసం 10%, జిడిపిలో 6శాతం నిధులు కేటాయించాలని అనేక సంవత్సరాలుగా విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నా కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదనీ శరత్ అన్నారు.ఈ కార్యక్రమంలో మేకల అభిరామ్ రాజు ,కార్తీక్ ,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply