Chief Minister | రాజీపడేది లేదు..

Chief Minister | రాజీపడేది లేదు..

సీఎం చంద్రబాబు

Chief Minister |వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : శాంతి భద్రతల విషయంలో రాజీపడేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటి వద్ద దాడిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మైలవరం టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసినట్లు సీఎంకు అధికారులు తెలిపారు. రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలన్నారు. ఉద్రిక్తతలకు దారితీసే చర్యలు సహించబోమన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ప్రజల భద్రతే అత్యంత ప్రాధాన్యమని సీఎం చంద్రబాబు అన్నారు.

Leave a Reply