Exams | పరీక్షా కాలం..

Exams | పరీక్షా కాలం..
- వచ్చె నెలలో టెన్త్, ఇంటర్ పరీక్షలు
- విద్యార్థులకు పౌస్టికాహారం అవసరం
- గుడ్ ఫుడ్‌తో ఒత్తిడి దూరం
- జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
Exams | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : విద్యార్థులకు పరీక్షా కాలం ఆసన్నమైంది. ఫిబ్రవరిలో టెన్త్ పరీక్షలు.. అవి అయిపోగానే ఇంటర్ ఎగ్జామ్స్ మొదలు కానున్నాయి. ఈ సమయంలో స్టూడెంట్స్ తిండి, నిద్ర మాని చదువులో మునిగి తేలుతుంటారు. స్పెషల్ క్లాసులు, స్టడీ అవర్స్ అంటూ స్కూల్, కాలేజీల్లో విద్యార్థులను ఊపిరి మెసలకుంటా చేస్తారు. ఇలాంటప్పుడు పిల్లలకు తగిన శక్తి అవసరం. ఇందుకోసం తగిన పోషకాహారం తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇప్పడు పరీక్షల వేళ ఎలాంటి ఆహారం తీసుకుంటే ఒత్తిడి తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..
- బాదం పాలు తాగడం, మితంగా తాగడం మంచిది. ఇది ఎక్కువ మానసిక చురుకుదనానికి దారితీసే ప్రోటీన్-రిచ్ ఫుడ్స్‌ను కలిగి ఉంటుంది.
- పరీక్ష రోజున గుడ్లు, గింజలు, పెరుగు , కాటేజ్ చీజ్ ఉన్నాయి. పరీక్ష రాసేటప్పుడు ఇది మీకు సహాయం చేస్తుంది.
- జామ్, గంజి, ఓట్ మీల్ లేదా చక్కెర లేకుండా తక్కువ కొవ్వు పాలు, గుడ్లు , ఆహారాలు తినడం మంచిది.
- కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మినరల్స్‌లో పుష్కలంగా ఉండే ప్రతి రోజూ ఒక గ్లాసు పాలను వారికి ఇవ్వండి.
- సాధారణ పాలైతే బాదం పొడిని కలిపి తాగవచ్చు.
- మాంసాహారులు తక్కువ నూనెతో చేసిన గుడ్డు, ఆమ్లెట్, చికెన్, చేపలు రోజూ తినొచ్చు.
- ఈ టైంలో అన్నం తగ్గించాలని, లేదంటే నిద్ర వచ్చేస్తుందని చెబుతున్నారు.
- తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి.
- అన్నాన్ని ఒకపూటకు పరిమితం చేసుకోవాలి.
- మిగతా వేళల్లో పొట్టుతో ఉన్న జొన్న, సజ్జ, గోధుమ రొట్టెలు లేదా దంపుడు బియ్యం వంటివి తీసుకుంటే బి కాంప్లెక్స్ కొరత ఉండదు.
- అలాగే, ఆకు, కాయగూరలకు ప్రత్యామ్నాయం లేదని తెలియజేస్తున్నారు.
- ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచడానికి అరటిపండు, ఆపిల్, నారింజ, బొప్పాయి, జామ లేదా పుచ్చకాయ వంటి పండ్లు ఇవ్వాలి.
- ఒత్తిడిని తట్టుకొనేందుకు విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండే నువ్వులు, అవిసె లడ్డూ, నట్స్, మరమరాలు, జొన్న పేలాలు, వేయించిన పుట్నాలు, బఠానీలు సాయపడతాయి.
- హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు టమాటా, కీరా, క్యారెట్, మునగాకు, కరివేపాకు, గోంగూర, పుదీనా పొడులు తింటే మేలు.
రోజూ 300 ML పాలు, పాల ఉత్పత్తులు తీసుకుంటే గ్లూకోమిక్స్, క్యాల్షియం తగినంత లభిస్తుంది. - వేడి వల్ల శరీరం లవణాలు కోల్పోయి నీరసం, తలనొప్పి వస్తాయి. ఇలాంటి సమయంలో మంచి నీరు ఎక్కువగా తాగాలి.
- అలాగే ఎలక్ట్రాల్, నిమ్మకాయ నీటిని రోజులో రెండు సార్లు తాగాలి.
- చక్కెర వేసిన జ్యూస్‌లకు దూరంగా ఉండాలి. వీటికి బదులుగా నేరుగా పండ్లు తినాలి.
- ఎక్కువ నూనెలు ఉండే పూరీ, వడ, పులిహోర, బిర్యానీ లాంటి వంటి జోలికి పోవద్దు.
- వీటికి బదులుగా పెరుగన్నం, కూరగాయ కర్రీ, ఆకుకూర పప్పు బ్యాలెన్స్డ్గా ఉంటుంది.
- సాయంత్రం వేళ బ్రెడ్, గ్లాసు పాలు, అరటిపండు, జామ్ లేదా తేనెతో చపాతీ, చట్నీ, పొడులతో ఇడ్లీ ఇవ్వొచ్చు.
- మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో.. స్నాక్స్ టైంలో ఎగ్స్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఇందులో విటమిన్ సి తప్ప అన్ని రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి.
- కిడ్నీ బీన్స్, బాదం, పిస్తా, జీడిపప్పు లాంటివి ఇవ్వాలి.
- పెసరట్టు, మినపట్టు, కుడుము, గుప్పెడు ఉడకబెట్టిన వేరుశనగలు, గుగ్గిళ్లు, అలసందలు ఇవ్వొచ్చని సలహా ఇస్తున్నారు.
