Yendapalli | కేసీఆర్‌పై సిట్ విచారణకు వ్యతిరేకంగా ధర్నా…

Yendapalli | కేసీఆర్‌పై సిట్ విచారణకు వ్యతిరేకంగా ధర్నా…
Yendapalli | ఎండపల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. కేసీఆర్‌పై సిట్ విచారణ జరపాలన్న డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా “డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి పాలన” అంటూ నినాదాలు చేశారు. ధర్నా సందర్భంగా దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుంటూ పరిస్థితిని అదుపులోకి తీసుకుని ధర్నాను విరమింపజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎండపల్లి మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ మాట్లాడుతూ….. రాజకీయ కక్షతోనే కేసీఆర్‌ను విచారణకు పిలుస్తున్నారని ఆరోపించారు. సిట్ పేరుతో వేధింపులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయంగా దెబ్బతీయాలన్న కుట్రను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. అవసరమైతే ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎండపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్, మాజీ ఎంపిటిసి గాజుల మల్లేశం, శానబండ సర్పంచ్ గాదం భాస్కర్, రాజారాంపల్లి ఉప సర్పంచ్ మెరుగు జానీ, మాజీ సర్పంచ్ మారం జలంధర్ రెడ్డి, నాయకులు పడిందం వెంకటేష్, ఉప్పు రాజయ్య, భారత్ రాజు తదితరులు పాల్గొన్నారు.
