శ్రీహరి అనుభవం ముందు…మేమంతా చిన్న బచ్చాగాళ్లమే.!
రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
శ్రీహరి అనుభవం ముందు…మేమంతా చిన్న బచ్చగాళ్లమే.!
-ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ కుటుంబ బలం స్పష్టమైంది
-సీఎంకు ఘన్పూర్ విజయం ఒక కానుకగా ఇవ్వాలి
-మూడో తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం
-సర్వే రిపోర్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక
-ప్రజల్లో బలమైన మద్దతు ఉన్నవారికే బి-ఫామ్
-గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ టికెట్లు.
-కడియం నాయకత్వంలో ఘన్‌పూర్‌లో గెలుపు ఖాయం
రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
స్టేషన్ ఘన్ పూర్ ఆంధ్రప్రభ: శ్రీహరి అనుభవం ముందు మేమంతా చిన్న బచ్చగాళ్లమేనని రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘన్పూర్ కాంగ్రెస్ శ్రేణులకు వ్యాఖ్యానించారు. కడియం శ్రీహరి నాయకత్వంలో ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ కుటుంబ బలం మరోసారి స్పష్టంగా బయటపడింది. మూడో తేదీ నుంచి ఎన్నికల ప్రచారం అధికా రికంగా ప్రారంభం కానుంది. పార్టీ సర్వే రిపోర్టుల ఆధారంగానే అభ్య ర్థు ల ఎంపిక జరగనుంది. ప్రజల్లో బలమైన మద్దతు, గెలిచే అవకాశాలు ఉన్నవారికే బి-ఫామ్, కాంగ్రెస్ టికెట్లు ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం స్పష్టం చేసింది. గెలుపు గుర్రాలకే టికెట్లు అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముం దుకు సాగుతుంది. కడియం నాయకత్వంలో ఘన్‌పూర్‌లో గెలుపు ఖాయమనే మంత్రి ధీమా వ్యక్తం వ్యక్తం చేశారు. శనివారం స్టేషన్ ఘన్ పూర్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్నాహక సమా వేశానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు.

ఘన్ పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశానికి అతి తక్కువ సమ యంలోనే వందలాది మంది హాజరవడం కాంగ్రెస్ కుటుంబ బలాన్ని చాటిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి నాయక త్వా నికి తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఘన్ పూర్ విషయంలో నేను ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు.. గత రెండేళ్లలో ప్రభుత్వం పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే శ్రీహరి ప్రజల ముందుకు తీసుకెళ్లారని తెలి పారు. అదేవిధంగా ఒక్క నామినేషన్ కూడా విత్‌డ్రా కాకుండా జాగ్రత్తగా చూసుకున్న సంబంధిత అడ్వకేట్‌కు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు కూడా ఒకటి రెండు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, త్వరలో సర్వే రిపోర్ట్ వస్తుందని చెప్పారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఎమ్మెల్యేతో చర్చించి, ఎవరికి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందో వారికి పార్టీ టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
-ప్రజాదరణ ఉన్న వారికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది:
ప్రజాదరణ ఉన్న వారికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది. అటువంటి అభ్యర్థులకు బి-ఫారమ్ అందజేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. వందకు వంద ఫలితాలు రావాలంటే మీ అందరి కృషి అవసరమని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనుభవం ఉన్నా వ్యక్తి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచనలను కచ్చితంగా పాటిస్తే అద్భుతమైన ఫలి తాలు వస్తాయని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఇంచార్జిగా పెద్దగా తెలివి పెట్టాల్సిన అవసరం లేదని, ఘన్‌పూర్‌లో గెలిచే నాయక త్వం ఉందన్నారు. అనంతరం గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుందని మంత్రి స్పష్టంగా చెప్పారు.
-సీఎంకు ఘన్పూర్ విజయం ఒక కానుకగా ఇవ్వాలి: ఎమ్మెల్యే కడియం
ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి..సీఎం రేవంత్ రెడ్డికు ఘన్ పూర్ విజయం ఒక కానుకగా ఇవ్వాలి..అదే మన లక్ష్యమని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మున్సిపాలిటీలో అభివృద్ధి కోసం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదు…పనుల ప్రభు త్వం అన్నదానికి నిదర్శనం. ప్రతి వార్డులో 5 నుంచి 10 వరకు దరఖా స్తులు రావడం చూస్తే, ప్రజలకు ఈ ప్రభుత్వంపై ఎంత విశ్వాసం ఉందో అర్థమవుతోంది.
రెండు దఫాలుగా సర్వే పూర్తయ్యింది. పీసీసీ ఆదేశాల మేరకు ప్రతి వార్డు నుంచి మూడు పేర్లను పంపించాం. ఇది పూర్తిగా పారదర్శకమైన ప్రక్రియ..ఘన్‌పూర్‌లో మన నాయకత్వం బలంగా ఉంది.ప్రజల మద్దతు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం ఇంకా మూడేళ్లు కొనసాగుతుంది. అభివృద్ధి కావాలంటే, నియోజకవర్గం ముం దుకు సాగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాల్సిం దే అన్న నమ్మకం ప్రజల్లో వంద శాతం ఉంది. మీ అందరి సమిష్టి కృషి తో వందకు వంద శాతం విజయం సాధిస్తామనే విశ్వాసం నాకు ఉంది.
ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం వరకు బీ-ఫారమ్‌లు అందజేయడం జరుగుతుంది. పీసీసీ ఆదేశాలు, స్టీరింగ్ కమిటీ ఆమోదం మేరకు పార్టీ ఎవరికీ టికెట్ ఇస్తుం దో, ఆ అభ్యర్థిని ప్రతి వార్డులో గెలిపించుకోవడం మన బాధ్యతని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ మారజోడు రాంబాబు, మార్కెట్ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, చిలు పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, కాంగ్రెస్ నాయకు లు బేలెదే వెంకన్న, బూర్ల శంకర్, పోగుల సారంగపాణి, రాజాక్ యాద వ్, కనకం రమేష్, సంపత్ రాజు, నాయకులు తదితరులు పాల్గొ న్నారు.
