NCP | శాసనసభాపక్ష నాయకురాలిగా..

NCP | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భార్య సునేత్రా పవార్ ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎంపీ అయిన ఆమె ఇవాళ ముంబైలోని విధాన్ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో సునేత్రా పవార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమెను ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇవాళ సాయంత్రం మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఆ రాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రి ఆమె అవుతారు.
