Maddi Medaram | మద్ది మేడారం సమ్మక్క సారలమ్మల ద‌ర్శ‌నం…

Maddi Medaram | మద్ది మేడారం సమ్మక్క సారలమ్మల ద‌ర్శ‌నం…

  • సమ్మక్క సారలమ్మలకు పట్టు వస్త్రాలు సమర్పించుకున్న దొంతి

Maddi Medaram | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నర్సంపేట డివిజన్ లోని నల్లబెల్లి మండలo నాగరాజుపల్లె గ్రామపంచాయతీ ప్రాంతంలో నిలయమైన మద్ది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఈ రోజు దర్శించుకొని, సమ్మక్క సారలమ్మలకు పట్టు వస్త్రాలు సమర్పించు కున్నారు. మద్ది మేడారం జాతరకు దర్శించు కోవడానికి వచ్చిన దొంతి మాధవరెడ్డికి మద్ది మేడారం జాతర చైర్మన్ అబ్బు రాజేష్ కుటుంబ సభ్యులు.

నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులు. నల్లబెల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు. మంగళ హారతులతో స్వాగతం పలికారు. సమ్మక్క సారలమ్మ జాతరకు దర్శించుకోవడానికి వచ్చిన వారందరూ కూడా పూలతో స్వాగతం పలికారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న తదుపరి ఈ సందర్భంగా దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ మద్ది మేడారo జాతర ఎంతో వైభవముగా సాగుతుందని అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ జాతర ఎంతో అభివృద్ధి చెందిందని ఇంక మునుముందు అభివృద్ధి చెందడానికి నిధులు మంజూరు చేసి జాతర అభివృద్ధికి తోడుపడతానని ఈ సందర్భంగా తెలిపారు. మన నర్సంపేట నియోజక వర్గంలో సమ్మక్క సారలమ్మ వనదేవతలు నల్లబెల్లి మండలం నాగరాజు పల్లి ప్రాంతానికి చెందిన చింతలచెరువు కట్ట మద్దిపేడారంలో కొలువై నందుకు మనమంతాఎంతో అదృష్టంవంతులం అన్నారు.

Leave a Reply