GOLD | ఎంత‌కీ దిగ‌నంట‌దే..!

ఎంత‌కీ దిగ‌నంట‌దే..!

  • ప‌సిడి ప‌రుగులు
  • కొండెక్కిన వెండి
  • ఆల్‌టైం రికార్డు

GOLD | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బంగారం, వెండి ధ‌ర‌లు మార్కెట్‌లో ప‌రుగులు తీస్తున్నాయి. ఆ రెండు రేట్ల పెరుగుద‌ల‌తో పోటీ ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే వీటి ధ‌ర‌లు రికార్డు సృష్టించాయి. బంగారం ధ‌ర రూ.2ల‌క్ష‌ల చేరువ‌లో ఉంది. వెండి ధ‌ర 4ల‌క్ష‌ల‌కు పైనే ఉంది. రోజురోజుకూ గోల్డ్‌, సిల్వ‌ర్ ధ‌ర‌లు పెరుగుతూ విక్ర‌య దారులు బెంబేలెత్తుతున్నారు. వాటిని కొనాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ స్థాయిలో ధరలు పెరగడం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ధ‌ర‌లు ఇలా భ‌గ్గుమంటుంటే కొనేదెలా అని ఆందోళ‌న చెందుతున్నారు. కేవలం బంగారం ధర మాత్రమే కాకుండా అందుకు తోడు 3 శాతం జీఎస్టీ, మేకింగ్ చార్జెస్ అదనంగా బాదుతుండటంతో వినియోగదారులపై తీవ్ర భారం పడుతోంది.

బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.11,770 పెరిగి రూ.1,78,850కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.10,800 ఎగబాకి రూ.1,63,950 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.4,25,000 వద్ద కొనసాగుతోంది.