Collector | ఆలేరు నామినేషన్ కేంద్రాన్ని సందర్శ‌న‌…

Collector | ఆలేరు నామినేషన్ కేంద్రాన్ని సందర్శ‌న‌…

Collector | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కార్యాలయంలోని ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా మొదటి రోజు నామినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించి ఎంతమంది అభ్యర్థులు, ఏయే వార్డుల నుండి నామినేషన్ పత్రాలను తీసుకువెళ్లారన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వార్డుల వారీగా వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుండి నామినేషన్ పత్రాలను తీసుకునేటప్పుడు నిబంధనలలో పేర్కొన్న అన్ని పత్రాలు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని స్పష్టంగా పరిశీలించాలని ఆయన చెప్పారు. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ పత్రాలను స్వీకరించాలని ఆయన తెలిపారు.

అనంతరం హెల్ప్ డెస్క్ ను కూడా పరిశీలించారు. భువనగిరి ఆర్డిఓ, మున్సిపల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులు,మున్సిపల్ కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విధుల్లో ఉన్న మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply