USA | తెలంగాణ వాసి మృతి

USA | తెలంగాణ వాసి మృతి

USA | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ వాసి అమెరికాలో గుండెపోటుతో మృతిచెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హర్షవర్ధన్ రెడ్డి(45) మృతిచెందాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో గుండెపోటుతో చనిపోయాడు.

వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తుండగా తన నివాసంలోనే గుండెపోటు వచ్చింది. ఆయన పదేళ్లుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. హర్షవర్ధన్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. తండ్రి సుదర్శన్‌రెడ్డి బొల్లారం గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. హర్షవర్ధన్ రెడ్డి మృతితో ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది.

Leave a Reply