Journalists | జర్నలిస్టుల పాత్ర కీలకం

Journalists | జర్నలిస్టుల పాత్ర కీలకం

Journalists | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాల నివారణలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఎస్సై ఎస్. శ్రావణి అన్నారు. ఈ రోజు మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో రోడ్డు ప్రమాదాల నివారణ గురించి జర్నలిస్ట్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

అనునిత్యం జనాలలో ఉండే జర్నలిస్టులు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల గురించి ప్రజలకు వివరించాలని ఎస్సై కోరారు. తాగి వాహనాలు నడపడం, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ ధరించడం, బాధ్యత రహిత డ్రైవింగ్ అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాద నివారణలో తమ వంతు బాధ్యత నిర్వహించాలని ఎస్ఐ సూచించారు.

Leave a Reply