Vizianagaram | నా సమస్య పరిష్కరించండి…

Vizianagaram | నా సమస్య పరిష్కరించండి…

  • కలెక్టరేట్ ఆవరణలో పెట్రోల్ పోసుకొని వ్యక్తి హల్చల్

Vizianagaram | విజయనగరం, ఆంధ్ర ప్రభ : ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా తన సమస్యను పరిష్కరించడం లేదని విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియం ఎదుట వ్యక్తి వంటిపై పెట్రోల్ వేసుకొని హల్చల్ చేశాడు. కుటుంబ సభ్యులు ఆస్తిలో తన వాటా తనకు ఇవ్వడం లేదని, ఎన్నిసార్లు గ్రీవెన్స్ లో ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకున్న నాధుడు లేకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమని భావించినట్లు చెప్పాడు. విషయం తెలుసుకున్న వెంటనే జేసీ సేదు మాధవన్, డిఆర్వో మురళి సదరు వ్యక్తి వద్దకు వచ్చి సమస్యను అడిగితెలుసుకున్నారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగాడు.

Vizianagaram

Leave a Reply