Makthal | ఘనంగా హయగ్రీవ హోమం

Makthal | ఘనంగా హయగ్రీవ హోమం
- పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి
Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వెలసిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం హయగ్రీవ హోమం వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పి. ప్రాణేశాచారి ఆధ్వర్యంలో వేద పండితులు కే. రాఘవేంద్ర ఆచార్య పర్యవేక్షణలో హయగ్రీవ హోమం నిర్వహించారు. గత కొంత కాలంగా హయగ్రీవ హోమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పేరిట వేద పండితులు అర్చకులు సంకల్పం చేయించారు. హోమం చేపట్టడం వల్ల జరిగే సత్ఫలితాలను మంత్రికి వివరించారు. ప్రతి నెల ఇలాంటి హోమం చేపట్టడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఒకానొక కాలంలో యజ్ఞ యాగాదుకు నిలయమైన మక్తల్ పట్టణంలో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో ప్రతినెల హోమం చేపట్టడం పట్ల మంత్రి అభినందనలు తెలియజేశారు. ఇలాంటి ధర్మకార్యాలు నిరంతరం కొనసాగాలని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. హోమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరికి ఆలయ ధర్మకర్త ప్రాణేశాచారి వేద పండితులు రాఘవేంద్ర ఆచార్య ఆశీర్వచనం అందజేశారు.
