Eluru | అంబరాన్నంటిన సంబరాలు..

Eluru | అంబరాన్నంటిన సంబరాలు..
- ఏలూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో సంక్రాంతి సందడి
- పోలీస్ కుటుంబాలతో కలిసి పాల్గొన్న జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ దంపతులు
Eluru | ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో బుధవారం పోలీస్ కుటుంబసభ్యులు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, సతీమణి ధాత్రి రెడ్డితో కలిసి ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ ఏలూరు జిల్లా ప్రజలకు బోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పండగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్‌లో పోలీస్ కుటుంబాల్లోని మహిళలు ముగ్గులు వేశారు. ఎస్పీ దంపతులు బహుమతులు అందజేశారు. ఈ ముగ్గులు పోటీల్లో పాల్గొన్నటు వంటి మహిళలకు మొదటి బహుమతిగా 15వేలు, రెండో బహుమతి గా 10వేలు, మూడో బహుమతి గా 5వేలు రూపాయలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో జంగారెడ్డి గూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్ ఐపీఎస్, ట్రైనీ ఐపీఎస్ జయ శర్మ ,ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్.సూర్య చంద్ర రావు, ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీమునిరాజా, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, ఎస్.బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వర రావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీ యు.రవి చంద్ర , ఏ.ఆర్.డీఎస్పీ చంద్ర శేఖర్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. సుబ్బారావు , ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్య నారాయణ, ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఆర్‌ఐ పవన్ కుమార్, సి.సి.ఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ హబీబ్ భాషా, ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు పోలీస్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



