37-indian-ships-stranded : ఇండియన్స్ బిక్కు బిక్కు Andhra Prabha Top Story
37-indian-ships-stranded : ఇండియన్స్ బిక్కు బిక్కు Andhra Prabha Top Story
- భారతీయ నావికుల్లో అలజడి
- వరుస దాడుల్లో ఆరుగురు బలి
- 37 భారతీయ నౌఖలు బంధీ
- 1100 ఇండియన్స్ ఆందోళన
( ఆంధ్రప్రభ, ముంబై ప్రతినిధి)

అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలో పశ్చిమాసియా అల్లాడిపోతుంటే… పర్షియన్ ప్రాంత సముద్ర జలాల్లో చిక్కుకుని వేలాది మంది భారతీయ నావికులు గజగజలాడుతున్నారు. ఏ క్షణంలో ఏ దేశం తమ నౌఖలపై దాడి చేస్తుందొ.. ఈ దాడుల్లో బతుకుతామో? చస్తామో? అనే భయంతో బిక్కు బిక్కుమంటున్నారు.
ఇరాన్ పై అక్కసుతో హార్ముజ్ జలసంధి సమీపంలో భారతీయ నౌకలపై అమెరికా దాడులకు పాల్పడుతోంది. ఇప్పటి భారతీయ నావికులు పని చేస్తున్న మూడు ఆయిల్ ట్యాంకర్లను అమెరికా వైమానిక దళం ధ్వంసం చేసింది. గత సోమవారం నుంచి జరిగిన ఈ మూడు దాడుల్లో.. ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందారు. ఈ దాడులను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారతీయ నావికుల నౌకలపై అమెరికా జిరిపిన దాడుల వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమాసియా (Middle East) ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘోర ఘటనలు చోటుచేసుకున్నాయి.
37-indian-ships-stranded : ముగ్గురు బలి
ఒమన్ తీరంలోని సోహార్ (Sohar) ఓడరేవుకు ఈశాన్యంగా సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో, హర్మూజ్ జలసంధి సమీపంలో ‘ఎంటీ సెట్టెబెల్లో’ (MT Settebello) నౌకపై దాడి జరిగింది. పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఈ ఆయిల్ ట్యాంకర్‌లో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా, అందులో 24 మంది భారతీయులు ఉన్నారు. ఈ దాడి కారణంగా నౌక ఇంజిన్ రూమ్‌లో భారీ పేలుడు సంభవించి నౌక నీటిలో మునిగిపోయింది. హెలికాప్టర్ల సాయంతో 21 మంది భారతీయులను ఒమన్ నావికాదళం సురక్షితంగా రక్షించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు తొలుత వీరు గల్లంతైనట్లు ప్రకటించారు. ఈ దాడిలో డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా , చీఫ్ ఇంజనీర్ పట్నాలా సురేష్ మృతి చెందారు. వీరి మృతదేహ్లను భారత్ కు కేంద్ర ప్రభుత్వం రప్పిస్తోంది.
37-indian-ships-stranded భారత్ గరం గరం
ఈ ఘటనపై కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన నావికుల పార్థివ దేహాలను వీలైనంత త్వరగా భారతదేశానికి రప్పించడానికి, సురక్షితంగా బయట పడిన 21 మందిని స్వదేశానికి తీసుకురావడానికి విదేశాంగ శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ దాడిపై భారత్ ఇప్పటికే అమెరికా దౌత్యవేత్తను పిలిపించి తన తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
37-indian-ships-stranded : ఎంటీ మారివెక్స్ పై తొలి దాడి

2026, జూన్ 8 (సోమవారం) జరిగింది.భారతీయ కాలమానం సోమవారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో ఈ నౌకపై దాడి జరిగింది. మధ్యాహ్నం 2:00 నుండి 2:20 గంటల మధ్య ముంబైలోని మేరిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ కు అత్యవసర సహాయం (SOS) కోరుతూ సందేశాలు అందాయి. అమెరికా యుద్ధ విమానం (F/A-18 సూపర్ హార్నెట్) ఈ నౌక ఇంజిన్ రూమ్‌పై క్షిపణి దాడి చేయడంతో నౌక వెనుక భాగంలో భారీగా మంటలు చెలరేగి మునిగిపోసాగింది. ఆ సమయంలో నావికులంతా నౌక ముందు భాగానికి చేరుకుని ప్రాణాలు రక్షించుకున్నారు. ముంబైలోని మేరిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ , ఒమన్ దేశ రక్షణ విభాగాలతో సమన్వయం చేసుకోగా, ఒమన్ రాయల్ నావికాదళానికి చెందిన హెలికాప్టర్లు వచ్చి నౌకలోని 24 మంది భారతీయులను సురక్షితంగా ఎయిర్‌లిఫ్ట్ (గాల్లోకి లాగి) చేసి ఒమన్‌లోని మసిరా (Masirah) దీవికి తరలించాయి
37-indian-ships-stranded : జల్ వీర్ నావికులు సురక్షితం
ఒమన్‌లోని షినాస్ పోర్ట్ సమీపంలో భారతీయ సిబ్బందితో ఉన్న ఎంటీ జల్వీర్ అనే మరో నౌక పై గురువారం అమెరికా దాడి చేసింది. మస్కట్‌లోని భారత ఎంబసీ స్థానిక అధికారులతో కలిసి వివరాలు సేకరించింది. ఈ నౌకలో 20 మంది భారతీయ నావికులు ఉన్నారు. ముందు రోజు, అంటే జూన్ 10న జరిగిన ‘ఎంటీ సెట్టెబెల్లో’ నౌకపై జరిగిన దాడిలోనే ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. రెండు ఘటనలు వెంట వెంటనే జరగడంతో చాలామంది ఎంటీ జల్వీర్‌లో నావికులు చనిపోయారని కంగారుపడ్డారు, కానీ జల్వీర్ నౌకలోని భారతీయులంతా సురక్షితంగా ఉన్నారు.
37-indian-ships-stranded :భారతీయ నావికుల్లో అలజడి
అమెరికా, ఇరాన్ యుద్ధం ఆరంభం నుంచి ఇప్పటి వరకూ ఆరుగురు భారతీయ నావికులు మృతి చెందారు. ఇరాన్ దాడిలొ ముగ్గురు, అమెరికా దాడిలో ముగ్గురు భారత నావికులు మృతి చెందారు. గల్ఫ్ ప్రాంతంలోని పర్షియన్ గల్ఫ్ , ఒమన్ గల్ఫ్ కనీసం 37 నుండి 38 భారతీయ నౌకలు వివిధ రేవుల్లో, సముద్ర జలాల్లో చిక్కుకుపోయాయి. వీటితో పాటు వందలాది విదేశీ నౌకలు కూడా అక్కడే నిలిచిపోయాయి. గల్ఫ్ రీజియన్ వ్యాప్తంగా వివిధ వాణిజ్య నౌకలపై సుమారు 23,000 మంది భారతీయ నావికులు విధుల్లో ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అత్యంత ఉద్రిక్తత నెలకొన్న హర్మూజ్ జలసంధి పరిసరాల్లో పశ్చిమంగా ఉన్న 24 నౌకల్లోనే 677 మందికి పైగా భారతీయ నావికులు చిక్కుకుని ఉన్నారు. నిలిచిపోయిన 37 భారతీయ నౌకల్లో దాదాపు 1,100 మందికి పైగా నావికులు సురక్షిత ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నారు అమెరికా, ఇరాన్ దాడుల్లో మరణించిన భారతీయ నావికులుఇప్పటివరకు జరిగిన దాడులు మరియు పశ్చిమాసియా సంక్షోభం కారణంగా మొత్తం 6 మంది భారతీయ నావికులు మరణించారు.
ALSO READ : 2-injured-us-iran-conflict : అమెరికా దూకుడు Andhra Prabha Top Story
