2019repeat | ప్రధాని చెప్పిందేంటి? ప్రచారం జరుగుతున్నదేంటి?

2019repeat | ప్రధాని చెప్పిందేంటి? ప్రచారం జరుగుతున్నదేంటి?

2019repeat | పశ్చిమాసియా యుద్ధం ప్రభావం… చమురు ఆందోళనలు
పెట్రోలు కొరత పుకార్లు… బంకుల వద్ద క్యూలు
సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం హల్ చల్
ప్రధాని అసలు వ్యాఖ్యలపై స్పష్టత
తప్పుడు వార్తలపై ప్రజల ఆగ్రహం

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచమంతా అల్లకల్లోలమవుతోంది. ముఖ్యంగా చమురు కొరత సమీప భవిష్యత్తులో మరింత తీవ్ర రూపం దాల్చే సూచనలు ఇప్పుడే కనిపిస్తున్నాయి. గ్యాస్ సిలెండర్ బుక్ చేస్తే ఎప్పటికొస్తుందో, అసలు వస్తుందో, రాదో తెలియని పరిస్థితి. గ్యాస్ దెబ్బకు అనేక హోటళ్ళు, హాస్టళ్ళు మూత పడుతున్నాయి, అక్కడక్కడా కొన్ని హోటళ్ళు చాలా ఐటెంస్ తగ్గించేసి, రేట్లు పెంచేసి, ప్రత్యామ్నాయ పద్ధతులతో వంట కానిచ్చేస్తున్నాయి.

ఆ వ్యాపారం అలా ఉండగానే, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు, ఒక్కసారిగా పెట్రోలు కొరత పుకారుతో బెంబేలెత్తిపోయిన ప్రజలంతా పొలోమని పెట్రోలు బంకుల దగ్గర క్యూలు కట్టారు.

సందట్లో సడేమియాలాగా సోషల్ మీడియాలో ఒక పుకారు షికారు చేస్తూ హల్ చల్ సృష్టిస్తోంది. అదేంటంటే, మళ్ళీ లాక్ డౌన్ పెట్టేస్తారు అని…అది కూడా సాక్షాత్తొ ప్రధాని నరేంద్రమోడీ గారే పార్లమెంటులో చెప్పారని. అడ్డూ అదుపూ లేని, సోషల్ మీడియా ఫేక్ ప్రచారగాళ్ళ పుణ్యమే ఇది అని నిజమైన వార్త తెలిసిన వాళ్ళు, నెటిజన్లు మండిపడుతున్నారు.

తప్పుడు ప్రచారాలను ఖండించాలి, విశ్వసనీయమైన సమాచారంను వ్యాప్తి చేయాలి కానీ, ఇదేమిటి? లేని వార్తలను వైరల్ చేస్తూ ప్రజల్లో మరింత భయానక వాతావరణం సృష్టించడమేమిటని పలువురు మండి పడుతున్నారు

అసలు ప్రధాని పిలుపునిచ్చినదేమిటి?

“కొవిడ్ సమయంలో ఎలా ఒకటిగా నిలిచామో, ఇప్పుడు కూడా అలాగే సిద్ధంగా ఉండాలి

అంటే, అలాంటి విపత్కర సమయం లాగే ఇప్పుడు కూడా ఈ ఒడిదుడుకులను ఎదుర్కోవాలి, ఎదురు నిలిచి పోరాడాలి. అని…అంతే కానీ, లాక్ డౌన్ పెట్టేస్తారు, మూసేస్తారు అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే అది సామాజిక బాధ్యత అనిపించుకోదని పలువురు అంటున్నారు.

ఈ కొరత త్వరలోనే సమసిపోతుందని ఆశిద్దాం. ఫేక్ వార్తలను తిప్పికొడదాం.

2019repeat
2019repeat

click here to read Attack | చమురు ట్యాంక్ పేలుడు.. మంటలు

click here to read more

Leave a Reply