HYD | ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం..!
ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో రైల్వే స్టేషన్ కింద విశ్వేశ్వరయ్య భవన్ వైపు ఉన్న పార్కులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో అప్రమత్తమైన మెట్రోరైలు సిబ్బంది.. రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్‌ను నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.