మెరుగైన సేవలు అందించాలి

మెరుగైన సేవలు అందించాలి
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
గోదావరిఖని, ఆంధ్రప్రభ : ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. శుక్రవారం గోదావరిఖని జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆసుపత్రిలోని మెడికల్ ఓపీ, న్యూ బ్లాక్, ఐసీయూ బ్లాక్, ఎమర్జెన్సీ విభాగం, డ్యూటీ డాక్టర్స్ గదులను పరిశీలించి,రోగులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకుని, అవసరమైన సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. శానిటేషన్ పనితీరును మెరుగుపర్చాలని సంబంధిత ఏజెన్సీకి సూచిస్తూ, తక్షణమే తనను కలవాలని ఆదేశించారు. రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బెడ్ స్ట్రెంగ్త్ పెంపు కోసం చర్యలు చేపట్టాలని, మెడిసిన్ విభాగానికి అదనంగా ఒక ఓపీ బ్లాక్ ఏర్పాటు చేయాలన్నారు. ల్యాబ్ యంత్రాలు, ఎసీ వంటి పరికరాల్లో ఎలాంటి లోపాలు వచ్చినా వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డాక్టర్ లు కృపా బాయి,రాజు,సంబంధిత అధికారులు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
