విద్యుత్‌ షాక్‌తో ఎఫ్‌బీఓ మృతి.. ఘన నివాళి

దండెపల్లి, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రేంజ్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎఫ్‌బీఓ బాణావత్‌ నవీన్‌ నాయక్‌ విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తాళ్లపేట్‌ రేంజ్‌ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

తాళ్లపేట్‌ రేంజ్‌ అధికారి వికాస్‌ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించి నవీన్‌ నాయక్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆయన సేవలను స్మరించుకున్నారు. నవీన్‌ నాయక్‌ కుటుంబ సభ్యులకు అధికారులు, సిబ్బంది ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.