ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం

ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం

తొర్రూరు టౌన్ ఆంధ్రప్రభ:

ఇటీవల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఎన్నికైన శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క , రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి , స్థానిక శాసనసభ్యులు, మహబూబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఉమా మురళి నాయక్ లతో కలిసి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు..ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు విద్యా, విజ్ఞాన సేవలు అందించే గ్రంథాలయాల అభివృద్ధికి ఆయన కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..

Leave a Reply