విదేశీ పర్యటన అనంతరం తాడేపల్లికి చేరుకున్న జగన్..

విదేశీ పర్యటన అనంతరం తాడేపల్లికి చేరుకున్న జగన్..

మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్టీఆర్ జిల్లా నేతలు..
దేవినేని అవినాష్ సహా పలువురు ప్రజాప్రతినిధుల భేటీ…
పార్టీ వ్యవహారాలపై స్వల్పంగా చర్చించిన నేతలు..

విజయవాడ, ఆంధ్రప్రభ : విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెంగుళూరు నుంచి బుధవారం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కీలక నేతలు, ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు తాడేపల్లి నివాసానికి చేరుకుని జగన్‌ను కలిశారు.

ఈ సందర్భంగా నాయకులను జగన్ ఆప్యాయంగా పలకరించి కొద్దిసేపు పార్టీ పరిస్థితులు, జిల్లాలో రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై స్వల్పంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ రాకతో తాడేపల్లి నివాసం వద్ద పార్టీ శ్రేణుల్లో ఉత్సాహ వాతావరణం నెలకొంది. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Leave a Reply