Sing Geetham | సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సినిమా
Sing Geetham | సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సినిమా
జూన్ 11న విడుదల
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
నాగ్ అశ్విన్ నిర్మాణంలో చిత్రీకరణ
Sing Geetham | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ బ్లాక్బస్టర్ తర్వాత చిరంజీవితో అశ్వనీదత్, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో భారీ గ్రాఫిక్స్ చిత్రంగా ‘భూలోక వీరుడు’ అనే సినిమా ప్రారంభమైంది. రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయిన తర్వాత, ప్రాపర్ స్టోరీ లైన్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వారి మధ్య చర్చలు సఫలమయ్యాయి. ఈ ఆగిపోయిన ప్రాజెక్ట్ విషయాన్ని పక్కనబెడితే, ఇప్పుడు అదే వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) / స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు 61వ సినిమాగా ‘సింగ్ గీతం’ రూపుదిద్దుకుంది. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారిగా సాధారణ డైలాగులు లేకుండా, పూర్తిగా పాటల రూపంలోనే సాగే మ్యూజికల్ ఫాంటసీగా (Musical Fantasy) ఈ సినిమా రూపొందింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు.అద్భుతమైన ప్రయోగాలతో తెరకెక్కిన ఈ ‘సింగ్ గీతం’ సినిమా థియేటర్లలోకి విడుదలయ్యేందుకు సిద్ధమైంది.
‘సింగ్ గీతం’ (Sing Geetham) అనేది లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయస్సులో తెరకెక్కించిన ఒక మ్యూజికల్ ఫాంటసీ, కామెడీ సినిమా. నిర్మాత నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 11 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇది ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఓ ప్రయోగాత్మక సినిమా. ఒక మారుమూల గ్రామానికి మంచి భవిష్యత్తు కోసం వచ్చే ప్రతాప్ అనే యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతను ఊహించని పరిస్థితుల్లో మాయా ప్రపంచంలో చిక్కుకుని, ప్రకృతిని కాపాడే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది ప్రధాన ఇతివృత్తం. ఈ చిత్రంలో అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, అంకుర్ సి సినిమాటోగ్రఫీ మరియు అరవింద్ ములే ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ చాలా విభిన్నంగా సాగుతున్నాయి. విశాఖపట్నం ఆర్కే బీచ్లో ‘ఆదిత్య 369’ నాటి టైమ్ మెషీన్ నమూనాను ప్రదర్శించడం విశేషంగా ఆకట్టుకుంది
