Shock for air passengers I 1200 Cancilled I విమాన ప్ర‌యాణికుల‌కు షాక్‌

  • మూడు నెల‌ల్లో 1200 విమానాలు ర‌ద్దు
  • నెల‌కు నాలుగు వంద‌లు చొప్ప‌న్న ర‌ద్దు చేసిన విమాన‌యాన సంస్థ‌లు
  • ఫ్యూయ‌ర్ ధ‌ర‌లు పెర‌గ‌డం.. నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు భారం కావ‌డ‌మే కార‌ణం

Shock for air passengers ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ (జాతీయం) : ప‌శ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ ప‌రిస్థితులు ప్ర‌భావం భారత విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. ఈ యుద్ధ నేప‌థ్యంలో ఫ్యూయ‌ల్ ధ‌ర‌లు పెరుగుతున్న సంగ‌తి విదిత‌మే. ఒక వైపు జెట్ ఫ్యూయ‌ల్ ధ‌ర‌లు పెర‌గ‌డం.. మ‌రో వైపు ఎయిర్ స్పేస్ ఆంక్ష‌లతో విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ క్ర‌మంలో జెట్ ఫ్యూయ‌ల్ ధ‌ర‌లు, నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు పెర‌గ‌డంతో ఎయిర్‌లైన్స్ (విమాన‌యాన సంస్థ‌లు) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు మూడు నెలల పాటు నెలకు సుమారు 400 చొప్పున మొత్తం 1,200 అంతర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్ ఇండియా నిర్ణ‌యంతో అమెరికా, సింగ‌పూర్‌, యూర‌ప్‌, ఉత్త‌ర అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా దేశాల‌కు వెళ్లాల‌ని ముందుగా ప్లాన్ చేసుకున్న ప్ర‌యాణికులు కంగుతిన్నారు.

Shock for air passengers స‌ర్వీసుల ర‌ద్దు మెసెజ్‌ల‌తో ప్ర‌యాణికుల షాక్‌

ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు భారీ సంఖ్యలో ర‌ద్దు చేస్తూ మెసేజ్‌లు పంపుతున్నారు. ఈ మెసెజ్‌లు చూసి వారు షాక్ గుర‌వుతున్నారు. ముంద‌స్తుగా ప్లాన్ చేసుకున్న‌వారు ఉన్నారు. దాదాపు 95 శాతం మంది బుకింగ్‌లకు సంబంధించి ర‌ద్ద‌యిన‌ట్లు సందేశాలు వస్తున్నాయి. సాధారణంగా నెలల ముందే ప్లాన్ చేసుకునే విదేశీ ప్రయాణాలకు, ఎయిర్‌లైన్స్ చివరి నిమిషంలో షాక్ ఇస్తున్నాయ‌ని ప్ర‌యాణికులు ఆందోళ‌న చెందుతున్నారు. ప్రయాణానికి కేవలం 4 నుంచి 5 రోజుల ముందు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశమైన షార్జా మీదుగా అమెరికా , యూరప్ దేశాలకు వెళ్లాల్సిన కనెక్టింగ్ విమాన సర్వీసులను భారీగా రద్దు చేసినట్లు తెలుస్తోంది. ర‌ద్ద‌యిన విమానాల్లో ప్ర‌యాణించాల్సిన వారు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

Shock for air passengers
Shock for air passengers

Shock for air passengers | రీఫండ్ గానీ.. ప్ర‌త్యామ్నాయ విమ‌నాలు..

ఎయిర్‌లైన్స్ నిర్ణ‌యం ప్ర‌కారం ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-న్యూయార్క్, ముంబై-జేఎఫ్‌కే, ఢిల్లీ-షాంఘై, చెన్నై-సింగపూర్ రూట్లలో విమానాలు పూర్తిగా రద్దు కానున్నాయి. సాన్ ఫ్రాన్సిస్కో, టొరంటో, ప్యారిస్, సింగపూర్, మెల్బోర్న్, సిడ్నీ సర్వీసులు కుదించ‌నున్నారు. విమానాల రద్దుతో ఇబ్బంది పడే ప్రయాణికులకు పూర్తి రీఫండ్ గానీ, ఉచితంగా ప్రత్యామ్నాయ విమానాలు, డేట్ మార్పు సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికులు తమ బుకింగ్స్ వివరాలను వెబ్‌సైట్ , యాప్‌లో తనిఖీ చేసుకోవాలని సూచించింది. పశ్చిమాసియాలో పరిస్థితులు మెరుగుపడితేనే తిరిగి విమాన సేవలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది.

click here to read more : రజనీపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

click here to read more :

Leave a Reply