past10Years | టీచర్స్ కాలనీలో మంటలతో భయాందోళన

past10Years | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : గుంటూరు నగర శివారులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టీచర్స్ కాలనీలో ఖాళీ ప్రదేశంలో నిల్వ ఉంచిన భూగర్భ డ్రైనేజీ పైపులకు మంటలు అంటుకోవడంతో భారీగా పొగలు, మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

గుంటూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ పనుల కోసం నిర్మాణ సంస్థ పెద్ద ఎత్తున పైపులను తీసుకొచ్చి ఖాళీ స్థలంలో నిల్వ ఉంచింది. అయితే కోర్టు కేసుల కారణంగా పనులు నిలిచిపోవడంతో ఆ పైపులు గత పదేళ్లుగా అక్కడే ఉండిపోయాయి. పైపుల చుట్టూ భారీగా చెత్త పేరుకుపోవడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది.

ఒక్కసారిగా పైపులు దగ్ధమవుతూ భారీగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply