ఈ క్యాష్​  .. కలెక్టర్​ దే..

ఈ క్యాష్​  .. కలెక్టర్​ దే..

బీహారీ ​ వ్యాపారి అఫిషీయల్​ కార్డ్​

ఇదొక కట్టుకథ.. పోలీసులు ఆశ్చర్యం

( గోరఖ్​ పూర్​ , ఆంధ్రప్రభ ప్రతినిధి)

బీహార్  బ్యాలెట్​ వార్​ లో.. ఎన్నో చిత్ర విచిత్ర ట్విస్టులు  తెరమీదకు రాగానే .. భారతవని ఆశ్చర్యపోతుంది. ఔరా ఇది నిజమా అని జనం అవాక్కవుతారు. నోరు వెళ్లబెడతారు. తాజాగా బీహార్​ గోరఖ్​ పూర్ ( Bihar Gorakh Pur) ​ లో .. సాదాసీదా బుక్​ స్టాల్​ నిర్వాహకుడి బ్యాగులో  కోటిరూపాయాల (Rs.1.00 Crore cash) నగదు .. ప్రత్యక్షం కాగా.. ఈ లెక్క పత్రం లేని డబ్బు ఎవరిదో  అనే అంశం ఓ మిస్టరీగా (Mystory)  మారింది.  

గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో  శుక్రవారం (07.11.2025) భారీ బ్యాగుతో మోకామాకు చెందిన ముకుంద్ మాధవ్ (32 ఏళ్ల యువకుడు)  ఫ్లాట్​ పారమ్​ పై .. పోలీసుల్నే గమనిస్తున్నాడు. సీసీ కెమెరాలో ఈ పరిస్థితిని గమనించి… సమ్​ థింగ్​ రాంగ్​ .. అని జీఆర్పీ సిబ్బంది రంగంలోకి దిగారు. ముందు టిక్కెట్​ అడిగారు. ఆ యువకుడు ఫస్ట్​ క్లాస్​ టిక్కెట్​ చూపించాడు. బ్యాగ్​ ను తనిఖీ చేయాలని కోరారు. ఆ అతడు  ఒప్పుకోలేదు. ఇది ఓ కలెక్టర్​ బ్యాగ్​ అని .. అఫీషియల్​ కార్డు విసిరాడు.  పోలీసు అధికారి వినోద్ కుమార్ (GRP  CI ) ఆ బ్యాగును చ ఓపెన్​ చేశారు. అందులో రూ.500 నోట్ల కట్టలు కనిపించాయి. ఈ డబ్బు ఎవరిది? ఏ బ్యాంకులో విత్​ డ్రా చేశావు? లేదా ఈ డబ్బు ఎవరు ఇచ్చారు? అని  సీఐ ప్రశ్నించారు.

మోకామాలో చిన్న బుక్​ స్టాల్​ నడుపుతున్నానని, చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేస్తానని ముకుంద్​ సమాధానం ఇచ్చాడు. ఈ డబ్బు  ఓ ఐఏఎస్​ ఆఫీసర్​ తనకు ఇచ్చి తన దగ్గర ఉంచాలని కోరాడని మాధవ్​ చెప్పాడు. పోలీసులు ఉరమి చూసే సరికి.. మరో కథ చెప్పాడు.  ఈ డబ్బు  అతడిదే నట.   స్నేహితుడికి అప్పుగా  ఇచ్చాడు.  అప్పు తిరిగి చెల్లిస్తూ  గోరఖ్​ పూర్​ లో ఓ వ్యక్తి దగ్గర  తీసుకోవాలని స్నేహితుడు  సమాచారం ఇచ్చాడు.  గోరఖ్‌పూర్   బార్గద్వా ప్రాంతానికి మాధవ్​ చేరుకున్నాడు.   ఓ గుర్తుతెలియని  కుర్రోడు బైక్​ ఇచ్చి ఈ బ్యాగ్​ ఇచ్చాడు. అని  మాధవ్  చెప్పాడు. బ్యాగ్​ లో ఎంత డబ్బు ఉందని అడిగితే.. సమాధానం రాలేదు. ఇక నోట్ల కట్టలను లెక్కపెడితే మొత్తం నగదు రూ.99.09లక్షలుగా పోలీపులు గుర్తించారు. ఇది లెక్కపత్రం లేని ఎలక్షన్​ డబ్బుగా భావించి.. ఈ డబ్బు ఆసాములెవ్వరో తేల్చే పనిని ఐటీశాఖకు పోలీసు శాఖ అప్పగించింది. బీహార్ లో ​ ఎన్నికల సందర్భంగా.. గత  జూలై నుంచి  బల్లియా, వారణాసి, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్చ  గోరఖ్‌పూర్  రైల్వే స్టేషన్లలో తొమ్మిది తనిఖీల్లో  రూ.5.29 కోట్లకు పైగా బ్యాక్​ మనీని జీఆర్పీ  స్వాధీనం చేసుకుంది.

Leave a Reply