Nizamabad | స్కూటీని ఢీకొన్న లారీ

Nizamabad | స్కూటీని ఢీకొన్న లారీ
- ఒకరికి తీవ్ర గాయాలు
Nizamabad | బాల్కొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 44పై బుధవారం ఉదయం లారీ స్కూటీని ఢీకొన్న ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న రావుట్ల నర్సయ్యకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు 108 వాహనంలో క్షతగాత్రున్ని ముందుగా బాల్కొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
