ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గొప్పది….
ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గొప్పది….
బిక్కనూర్, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో గొప్పదని ఎమ్మెల్సీ అంజిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సంతోష్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కాచాపూర్ గ్రామంలో ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని దరఖాస్తు పారాన్ని పూర్తి చేశారు. అనంతరం బిఎల్ఓ లకు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బిఎల్ఓ ల వద్ద దరఖాస్తు ఫారం తీసుకుని పూర్తి చేసి తిరిగి వారికి అందజేయాలని చెప్పారు. వెంటనే ఓటర్లుగా తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ఓటర్ జాబితా సవరణలకు ప్రతి ఒక్కరూ పూర్తి సహకారం అందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది ఉన్నారు.
