కంట్రోల్ రూమ్ కూడలిలో విఎమ్.రంగా విగ్రహం

కంట్రోల్ రూమ్ కూడలిలో విఎమ్.రంగా విగ్రహం

ఎమ్మెల్యే బొండా ఉమాని కలిసి రాధారంగా మిత్రమండలి.

పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావును రాధారంగా మిత్ర మండలి సభ్యులు గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు.

పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ కూడలి వద్ద ఏర్పాటు చేయాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రవేశపెట్టిన తీర్మానం అధికారికంగా ఆమోదం పొందిన నేపథ్యంలో రాధా రంగా మిత్రమండలి, మా మిత్రమండలి సభ్యులు బొండా ఉమాని కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మా మిత్రమండలి అధ్యక్షులు చింతల రామారావు (బాబీ) తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply