Maheshwar Reddy | ఆత్మహత్య కేసులో వైసీపీ నేతపై చర్యలు

Maheshwar Reddy | ఆత్మహత్య కేసులో వైసీపీ నేతపై చర్యలు

Maheshwar Reddy | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే సోదరుడైన రాజశేఖర్ రెడ్డిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణల కేసులో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

2025లో తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వర్గంపై పోస్టులు పెట్టాడనే కారణంతో రాజశేఖర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని మృతుడి తండ్రి మలిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బెదిరింపులకు సంబంధించిన ఆడియోలు, వీడియోల ఆధారంగా ఫిర్యాదు అందడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అనంతపురం రూరల్ పోలీసులు, రాప్తాడు పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. ఈ కేసులో రాజశేఖర్ రెడ్డితో పాటు జైపాల్ రెడ్డిని కూడా అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఇవాళ ఉదయం ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Leave a Reply