Law Minister | పార్లమెంట్లో విస్తృత చర్చ..

Law Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ అమలు, డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించిన మూడు ముఖ్య బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ ఈ బిల్లులను సభ ముందుకు తీసుకువచ్చారు.
ఈ బిల్లుల ద్వారా 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచే ప్రతిపాదనను కూడా తీసుకొచ్చింది.
అదనంగా, 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టడం, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించడం వంటి అంశాలు ఈ బిల్లుల్లో పొందుపరిచారు. ఈ కీలక బిల్లులపై పార్లమెంట్లో విస్తృత చర్చ జరగనుండగా, దేశ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.
