Kingdom ట్రైలర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ !

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘‘కింగ్డమ్’’ మంచి హైప్‌ను సంపాదించుకుంది. కాగా, ఆ హైప్ ను మరింత పెంచుతూ… అభిమానులను ఉత్సాహపరిచిన టీజర్ తర్వాత, మేకర్స్ చివరకు సినిమా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.
జూలై 31న ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ఇటీవల ఖరారు చేయగా, ఈసారి ట్రైలర్‌ను జూలై 26న తిరుపతిలో జరిగే గ్రాండ్ ఈవెంట్లో విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటిస్తూ, విజయ్ దేవరకొండ ఉన్న కొత్త పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఆ పోస్టర్లో విజయ్ మాస్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
