Kabaddi Girls | ఆటల్లో అదరగొట్టారు..

Kabaddi Girls | ఆటల్లో అదరగొట్టారు..
- కూచిపూడి రోటరీ క్లబ్ పోటీలో తలగడ దీవి విద్యార్థుల ప్రతిభ
Kabaddi Girls | నాగాయలంక, ఆంధ్రప్రభ : రోటరీ క్లబ్ కూచిపూడి యువజన మహోత్సవంలో భాగంగా ఈనెల 15, 16వ తేదీలలో పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గ స్థాయిలలో నిర్వహించారు. కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ పోటీలలో తలగడ దీవి జెడ్పీపాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఆటను ప్రదర్శించారు. కబడ్డీ బాలికల విభాగంలో మొదటిస్థానంలో నిలిచి 5వేల రూపాయలు నగదును, విన్నర్స్ ట్రోఫీని… అలాగే బాలుర కబడ్డీ విభాగంలో మొదటి స్థానాన్ని సంపాదించి 5వేల రూపాయలు నగదును, విన్నర్స్ ట్రోఫీని… బాలికల టగ్ ఆఫ్ వార్ పోటీల్లో రెండవ స్థానంలో నిలిచి మూడు వేల రూపాయలు నగదును గెలుపొందారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండ్రెడ్డి శివరాం ప్రసాద్ తెలిపారు. ఈ పోటీలలో సాధించిన బాల బాలికలను శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ బీపీఎల్ ప్రసాద్ ను పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మోహన్ లాల్ పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ వర్రే రాంబాబు అభినందించారు. ఈ పోటీలో ముగింపు వేడుకలో ముఖ్య అతిథిగా కూచిపూడి ఎస్సై పి .శిరీష పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
