inquiry | హైకోర్టు సంచలన తీర్పు…

inquiry | హైకోర్టు సంచలన తీర్పు…
inquiry | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క : కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లో అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోరాదని స్పష్టం చేస్తూ బీఆర్‌ఎస్ నేతలకు ఊరట కల్పించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్‌లను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు తన తీర్పును వెల్లడించింది.
ఈ కేసులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు కోర్టు ఊరట కల్పించింది. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. అలాగే, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో అవసరమైన నిబంధనలు పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. దీంతో ఈ వ్యవహారంపై మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది.
