నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘హిట్-3’. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా, మేకర్స్ తాజాగా ఈ సినిమా నుండి రెండవ సింగిల్ సాంగ్‌ను విడుదల చేశారు.
‘అబ్కీ బార్ అర్జున్ సర్కార్’ అనే ఈ పాట సినిమా స్లోగన్ అని మేకర్స్ వెల్లడించారు. ఈ పాటతో అర్జున్ సర్కార్ ఎలా కనిపిస్తాడో ప్రేక్షకులకు వివరించారు మేరకర్స్. ఆద్యంతం ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
హిట్-3 ట్రైలర్ విడుదల తేదీని వెల్లడించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మూవీని మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.