పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘హరి హర వీర మల్లు’ ట్రైలర్ సంచలనం సృష్టిస్తూ దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డు నెలకొల్పింది.
విడుదలైన 24 గంటల్లోనే YouTubeలో 48 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అన్ని భాషల కలిపి మొత్తం 61.7 మిలియన్ వ్యూస్ సాధించింది. దీంతో హరి హర వీర మల్లు దక్షిణ భారత చలనచిత్రాల్లోనే అత్యధికంగా వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా కొత్త రికార్డును సృష్టించింది.
ఈ ట్రైలర్‌లో ఈ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ రాజసంగా, దూకుడుతో కూడిన కొత్త అవతారంలో దర్శనమిచ్చారు. పవన్ కళ్యాణ్ శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
జూలై 24న గ్రాండ్‌గా విడుదల కానున్న ‘హరి హర వీర మల్లు’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ట్రైలర్‌కి వచ్చిన స్పందన, ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుండి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే, ఈ సినిమాపై మరింత హైప్ పెరుగుతోంది.