Budjet | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు..

Budjet | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు..
Budjet | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బడ్జెట్ రోజున కుప్పకూలిన మార్కెట్లు.. ఇవాళ పుంజుకొన్నాయి. సెన్సెక్స్ 944 పాయింట్లు లాభపడి 81,666 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 263 పాయింట్లు దూసుకెళ్లి 25,088 వద్ద క్లోజ్ అయింది.
ఇవాళ దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే పయనించాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, మెటల్ షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపించాయి. మార్కెట్ల పెరుగుదలతో ఇన్వెస్టర్ల సంపద కొన్ని లక్షల కోట్లు పెరిగింది. మొత్తానికి, బుల్ రన్ కొనసాగుతుండటంతో ట్రేడర్లలో నూతనోత్సహం నెలకొంది. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఉన్న ఆశలు, బలమైన త్రైమాసిక ఫలితాలు మార్కెట్లకు ఊతాన్నిచ్చాయి.
