ED విచారణ.. అల్లు అరవింద్ క్లారిటీ

గీతా ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారం ప్రశ్నించింది. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈడీ విచారణకు హాజరైన విషయాన్ని ఆయన ధృవీకరించారు. అయితే, దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న అనేక ఊహాగానాలకు ముగింపు పలుకుతూ, పూర్తి స్థాయిలో స్పష్టతనిచ్చారు.

అల్లు అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం — 2017లో ఓ ప్రాపర్టీ కొనుగోలులో ఆయన మైనర్ భాగస్వామిగా ఉన్నట్లు తెలిపారు. ఆ ప్రాపర్టీపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలోనే ఈడీ ఆయనను విచారించిందని చెప్పారు.
“నిజంగా నేను ఆ ప్రాపర్టీలో చిన్న భాగస్వామిని మాత్రమే. బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో నా పేరు ఉండటంతో విచారణకు పిలిచారు. తప్పు చేశానన్నది కాదు,” అని ఆయన స్పష్టం చేశారు.

ఈ కేసుకు కేంద్రబిందువుగా ఉన్నది రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థ. యూనియన్ బ్యాంక్‌కు ఈ సంస్థ రూ.100 కోట్ల అప్పు ఎగ్గొట్టినట్లు ఆరోపణలున్నాయి. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ వాటాలను అల్లు అరవింద్ కొన్నారన్న నేపధ్యంలోనే ఈ కేసులో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది.

ఈ అంశంపై ఇంకా వివరాలు తేలాల్సి ఉండగా, వచ్చే వారం మళ్లీ విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించినట్లు అల్లు అరవింద్ తెలిపారు. మొత్తం మీద, తనపై వచ్చిన ఆరోపణలతో ఏదైనా తప్పుదారి పట్టే రీతిలో అభిప్రాయపడకూడదని, విచారణ సహజ ప్రక్రియలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply