Donald Trump | పుతిన్‌తో మాట్లాడిన ట్రంప్‌…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణలో ట్రంప్, పుతిన్ ఉక్రెయిన్-ర‌ష్యా యుద్దం, మిడిల్ ఈస్ట్, ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాలర్ శక్తి వంటి అనేక ఇతర విషయాలపై చర్చించారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు ట్రంప్.. ముఖ్యంగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో లక్షలాది మరణించినట్టు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని విరమించాలని.. ఈ యుద్ధం కారణంగా ఇక ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని సంప్రదించి వెంటనే చర్చలు ప్రారంభిస్తానని ట్రంప్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *