Chiru Vs Balayya | ఒక తరహా కథతో చిరు, బాలయ్య..?
Chiru Vs Balayya | ఒక తరహా కథతో చిరు, బాలయ్య..?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలయ్య.. ఈ ఇద్దరూ బాక్సాఫీస్ దగ్గర నువ్వా – నేనా అన్నట్టుగా పోటీపడిన సందర్బాలు ఉన్నాయి. నాటి నుంచి నేటికీ వైవిధ్యమైన కథలతో ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు చిరు, బాలయ్య చేస్తున్న సినిమాలతో మరోసారి పోటీపడున్నారని.. ఇప్పుడు చేస్తున్న సినిమాలు రెండూ కూడా ఒకే నేపథ్యంతో రాబోతున్నాని ఇండస్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. చిరు, బాలయ్య చేస్తున్న సినిమా ఏంటి..? వాటి నేపథ్యం ఏంటి..?
Chiru Vs Balayya | పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామా..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ గతంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా రూపొందించడం.. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బష్టర్ అవ్వడం తెలిసిందే. దీంతో ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుందని.. ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ కథను డిజైన్ చేశారని తెలిసింది. ఇందులో చిరు వింటేజ్ లుక్‌లో కనిపించనున్నారని, అనస్వర రాజన్ ఆయన కూతురిగా నటిస్తుండటం కథలోని ఎమోషనల్ యాంగిల్‌ను హైలైట్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది.
Chiru Vs Balayya | వీరయ్యను మించిన మ్యాజిక్..

ఈ భారీ, క్రేజీ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. మోహన్ లాల్ నటిస్తుండడంతో ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్‌ను తెస్తోంది. ఈ సినిమాకి కాక లేదా కాకాజీ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బాబీ తన గత చిత్రం వాల్తేరు వీరయ్య మ్యాజిక్‌ను మించిపోయేలా ఈ గ్యాంగ్‌స్టర్ స్టోరీని డిజైన్ చేసినట్లు సమాచారం. ఈపాటికే సెట్స్ పైకి రావాలి. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతోంది. మెగాస్టార్ మరో్సారి మార్క్ గ్రేస్, యాక్షన్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.
Chiru Vs Balayya | ఊర మాస్ గ్యాంగ్ స్టర్ డ్రామా..

ఇక బాలయ్య సినిమా విషయానికి వస్తే.. ఇటీవల అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య.. నెక్ట్స్ మలినేని గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు. ముందుగా హిస్టారికల్ స్టోరీతో సినిమా చేయాలి అనుకున్నారు. అయితే.. బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశ్యంతో ప్లాన్ మార్చారు. కథను పూర్తిగా మార్చేసారు. మలినేని గోపీచంద్ కూడా చిరు మూవీ వలే గ్యాంగ్ స్టర్ డ్రామాను ఎంచుకున్నారట. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా, ఊర మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో స్టోరీ రెడీ చేశారట. ఇది ఊర మాస్ గ్యాంగ్ స్టర్ డ్రామా అని సమాచారం.
Chiru Vs Balayya | సంక్రాంతి బరిలో..

ఈ వార్త లీకైనప్పటి నుంచి ఏ గ్యాంగ్ స్టర్ డ్రామా జనాలకు విపరీతంగా నచ్చుతుంది అనేది ఆసక్తిగా మారింది. చిరుతో బాబీ ఆల్రెడీ ఒక్క బ్లాక్ బస్టర్ అందించారు. దీంతో ఈసారి చేసే సినిమాను అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తుండడంతో ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. బాలయ్యతో మలినేని కూడా వీరసింహారెడ్డి అనే సినిమా తెరకెక్కించడం.. అది బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈసారి చేస్తున్న మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి పోటీపడే ఛాన్స్ ఉంది. దీంతో గెలిచేది ఎవరు అనేది ఆసక్తిగా మారింది. చూడాలి మరి.. ఒకే తరహా కథతో వస్తున్న చిరు, బాలయ్య ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో..
